News March 12, 2025

సంగారెడ్డి: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులతో మంత్రి సమావేశం

image

ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయాలని కొండా సురేఖ సూచించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎస్జీఎఫ్ నిధులు కేటాయిస్తామని తెలిపారు.

Similar News

News March 5, 2026

కర్నూలు: 395 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

పత్తికొండ శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని తెలిపారు.

News March 5, 2026

విశాఖ భూగర్భంలో రెడీగా మిలియన్ టన్నుల చమురు!

image

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ నేపథ్యంలో మన దేశంలో ముడి చమురు నిల్వల సామర్థ్యం చర్చనీయాంశమైంది. అయితే ఇంధన సంస్థల నిల్వలతో పాటు విశాఖ, కర్ణాటకలోని మంగళూరు, పడూరులో అండర్‌గ్రౌండ్‌లో 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు భద్రంగా ఉందని తెలుసా? వీటినే స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ అంటారు. 2015లో ఫేజ్-1 లాంచ్ కాగా మరిన్ని ఏర్పాటుకానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉండేందుకు వీటిని తీసుకొచ్చారు.

News March 5, 2026

ఫైనల్‌కు ఒక్క అడుగుదూరంలో..

image

T20WC: నేడు ముంబై వేదికగా భారత్ ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో వరుసగా మూడోసారి ఇంగ్లండ్‌తో ఆడనుంది. 2022లో ఇంగ్లండ్, 2024లో భారత్ సెమీస్ విజేతలుగా నిలిచాయి. ఇక హెడ్ టు హెడ్‌లో భారత్‌దే పైచేయి. T20WC చరిత్రలో ఐదుసార్లు తలపడగా IND మూడుసార్లు గెలిచింది. 2024 మ్యాజిక్‌ను రిపీట్ చేసి మళ్లీ ఫైనల్ చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాత్రి.7.00కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.