News March 23, 2024
నల్గొండ, భువనగిరిపై తర్జనభర్జన

నల్గొండ, భువనగిరి లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తర్జనభర్జన పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్ కత్తిమీద సాములా మారింది. ఇప్పటివరకు విజయం సాధించని నల్గొండ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలో దింపేలా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం కాకుండా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న స్థానాలు ఇక్కడివే కావడం గమనార్హం.
Similar News
News April 19, 2025
MGU పీజీ, ఎంసీఏ, ఐపీసీ మూడో సెమిస్టర్ ఫలితాల విడుదల

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ మూడవ సెమిస్టర్ ఐపీసీ, ఎంసీఏ, ఐఎంఏఈ మూడో సెమిస్టర్ ఫలితాలను సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి శనివారం విడుదల చేశారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చూసుకోవాలన్నారు. .
News April 19, 2025
కేతేపల్లి: తండ్రి మందలించడంతో యువకుడి సూసైడ్

తండ్రి మందలించడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. కేతేపల్లి మండలం వెంకన్నపల్లికి చెందిన కొండయ్య(32) డ్రైవర్‌గా పనిచేసేవాడు. బైక్ విషయంలో తండ్రి, కొడుకు మధ్య గొడవ జరగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 16న పురుగు మందు తాగాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News April 19, 2025
నల్గొండ: రూ.300 కోట్లు మోసం చేశారని ఆందోళన

విప్స్ కంపెనీ డైరెక్టర్లమని తమను నమ్మించి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విప్స్ కంపెనీ బాధితులు కోరారు. ఈ మేరకు శుక్రవారం నల్గొండ డీఎస్పీ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ.. కంపెనీలో డైరెక్టర్లమని ప్రజలను మభ్యపెట్టి జిల్లాలో దాదాపు రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టించి మోసం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.