News March 12, 2025

ఏలూరు జిల్లాలో దాదాపు 49,436 మందికి లబ్ధి

image

స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు ఏర్పరచాలనే ధృఢ నిశ్చయంతో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించిందని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. జిల్లాలో దాదాపు 49,436 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాలు వివిధ దశలలో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని ఎస్సీలు, బీసీలకు ₹.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పీవిజిటీలకు రూ. లక్ష మంజూరు చేయడం జరిగిందన్నారు.

Similar News

News March 13, 2026

గృహ అవసరాల గ్యాస్ వాణిజ్యానికి వాడితే కేసులు: అదనపు కలెక్టర్

image

గృహ అవసరాలకు కేటాయించిన వంట గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన ఛాంబర్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులతో గ్యాస్ సరఫరాపై సమీక్ష నిర్వహించారు. వాణిజ్య స్థావరాల్లో గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్నారా లేదా అన్న అంశంపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News March 13, 2026

జగిత్యాల: ఎస్ఎస్సీ పరీక్ష కేంద్రంలో మౌలిక వసతుల తనిఖీ

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఎస్ఎస్సీ పరీక్షల నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేటలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము తనిఖీ చేశారు. పరీక్షల కోసం సిద్ధం చేసిన తరగతి గదులు, తాగునీటి సదుపాయం, వెంటిలేషన్, విద్యుత్ సౌకర్యం, మూత్రశాలల శుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.

News March 13, 2026

మెదక్: టెన్త్ విద్యార్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

image

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు మెదక్ డీఈఓ విజయ తెలిపారు. బాలురు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. రూట్లతో సంబంధం లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలకు ఆధార్ కార్డు ద్వారా మహాలక్ష్మి పథకం కింద ఉచిత సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు భయం వీడి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.