News March 12, 2025
కాకినాడ: ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. రెగ్యులర్‌గా 22,579 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 21,694 మంది హాజరయ్యారు. 885 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్ అధికారి నూకరాజు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో 1,748 మందికి గాను 1,612 మంది హాజరయ్యారని, 136 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. అన్ని సెంటర్లలో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అన్నారు.
Similar News
News March 5, 2026
మామునూరు ఎయిర్పోర్టు.. హద్దులను పరిశీలించిన కలెక్టర్

మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనుల నేపథ్యంలో కొత్తగా భూసేకరణ చేసి హద్దులు నిర్ణయించిన ప్రాంతాన్ని వరంగల్ కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ ప్రాంతంలో పర్యటించారు. కొత్తగా సేకరించిన భూముల సర్వే నంబర్లు, నిర్ణయించిన హద్దులను కలెక్టర్ పరిశీలించారు. భూహద్దుల నిర్ధారణ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
News March 5, 2026
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్

పొడవైన విద్యుత్ లైన్లలో(25 కి.మీ కంటే ఎక్కువ) విద్యుత్ సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించడానికి
ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్లు బిగిస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. 33KV ఫీడర్లలో 775, 11KV ఫీడర్లలో 15352 ఇన్‌స్టాల్ చేశామన్నారు. లైన్లను జీఐఎస్ మ్యాప్పింగ్ 33 కేవీ 671 ఫీడర్లలో 14544 కిలో మీటర్లు,11 కేవీ 4471 ఫీడర్లలో 40572 కిలో మీటర్లు పూర్తి చేశామని చెప్పారు.
News March 5, 2026
హవేలీఘనాపూర్: విద్యుదాఘాతంతో రైతు మృతి

హవేలీఘనాపూర్ మండలం బి. తిమ్మాయిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రైతు ఎర్ర బిక్షపతి(42) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య నాగమణి, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


