News March 12, 2025
పార్వతీపురం: వన్యప్రాణులకు తాగునీటి ఏర్పాట్లు

వేసవికాలంలో వన్యప్రాణులు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అటవీ ప్రాంతంలో తాగునీటి కుంటలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్వతీపురం అటవీ శాఖ రేంజర్ బిర్లంగి రామ్ నరేశ్ తెలిపారు. మంగళవారం కొమరాడ మండలంలో సరుగుడు గూడ అటవీ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ పరిశీలనలో కొమరాడ అటవీ శాఖ సెక్షన్ అధికారి బీట్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 6, 2025
రామ్ లక్ష్మణ్ థియేటర్ వద్ద ప్రేక్షకుల ఆందోళన

వరంగల్ రామ్ లక్ష్మణ్ థియేటర్ వద్ద సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆందోళన చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు జురాసిక్ వరల్డ్ 3D సినిమా నడుస్తున్న క్రమంలో, త్రీడీ బొమ్మ కనిపించకపోవడంపై ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. థియేటర్ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహించారు. షో నిలిపి వేసి టికెట్ డబ్బులు ఇచ్చి పంపించారు.
News July 6, 2025
పెద్దమందడిలో 12.8 మి.మీ వర్షపాతం

జిల్లాలో గత 24 గంటల్లో (నిన్న ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 8:30 వరకు) పెద్దమందడిలో అత్యధికంగా 12.8 మి.మీ వర్షం కురిసింది. అమరచింత 10.2 మదనాపూర్ 6.2 ఘనపూర్ 1.4 గోపాల్పేట్ 1.6 రేవల్లి 7.6 పానగల్ 4.4 వనపర్తి 1.2 కొత్తకోట 2.6 ఆత్మకూరు 1.6 శ్రీరంగాపూర్ 3.0 వీపనగండ్ల 2.8 చిన్నంబావి లలో 1.8 మి.మీ వర్షపాతం, పెబ్బేర్‌లో ‘0’మి.మీ వర్షపాతం నమోదయినట్లు జిల్లా సీపీఓ తన నివేదికలో పేర్కొన్నారు.
News July 6, 2025
జగిత్యాల: ముఖ్యమంత్రికి లేఖ రాసిన మాజీ మంత్రి

రాష్ట్ర మత్స్యకారులకు చేపల విత్తనం పంపిణీకి బదులుగా.. వాటి విలువ నగదు రూపేనా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాజీమంత్రి జీవన్ రెడ్డి ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రంలో చేపల విత్తనాలను స్వయంగా సమకూర్చుకునే వసతి లేనందున పక్క రాష్ట్రం ద్వారా ఎగుమతి చేయడంతో సమయం వృథా అవుతుందని, మత్స్యకారులు నష్టపోతున్నారని తెలిపారు. చేపల పెంపకంలో ఎంతో అనుభవం కలిగిన మత్స్యకారులకు నేరుగా నగదు చెల్లించాలని కోరారు.