News March 12, 2025
క్రీడాకారులకు కలెక్టర్ సర్టిఫికెట్లు పంపిణీ

అల్లూరి జిల్లా నుంచి జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జిల్లా నుంచి జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఆర్చరీ, అథ్లెటిక్స్, హ్యాండ్ బాల్, కబడ్డీ పోటీల్లో 15 మంది పాల్గొన్నారు. దీనిలో హ్యాండ్ బాల్ 2వ స్థానం సాధించిన గౌరీ శంకర్, డిస్కస్ త్రోలో 3వ స్థానం సాధించిన చంద్రశేఖర్ నాయుడును కలెక్టర్ అభినందించారు.
Similar News
News November 2, 2025
అల్లూరి: మొదటి రోజు 94.88% పెన్షన్ పంపిణీ పూర్తి

అల్లూరి జిల్లాలో మొదటి రోజైన శనివారం 94.88% పెన్షన్ పంపిణీ పూర్తయిందని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 22 మండలాల్లో 1,22,306 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.51,51,80,000 మంజూరైందన్నారు. శనివారం రాత్రి పంపిణీ ముగిసే సమయానికి 1,16,039 మందికి రూ.48,78,87,500 పంపిణీ చేశామన్నారు. మిగిలిన 6,267 మందికి పెన్షన్ పంపిణీ జరుగుతుందన్నారు.
News November 2, 2025
బియ్యం బస్తా మోసిన ఎమ్మెల్యే నాయకర్

తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన వేములదీవిలో శనివారం నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో 50 కేజీల బియ్యం బస్తా, ఇతర సరుకులను ఇంటికి తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగురాలిని ఎమ్మెల్యే నాయకర్ గమనించారు. వెంటనే ఆయనే స్వయంగా బియ్యం బస్తాతో సహా సరుకులన్నింటినీ తన భుజాలపై మోసుకుని, ఆమె త్రిచక్ర వాహనం వరకూ చేర్చారు. ఆపదలో ఉన్న బాధితురాలికి ఎమ్మెల్యే చేసిన సాయం ఆదర్శంగా నిలిచింది.
News November 2, 2025
ఏలూరులో ఈనెల 5న జాబ్ మేళా

ఏలూరు అశోక్ నగర్ కేపీడీటీ హైస్కూల్ ఆవరణలో ఈనెల 5 బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జితేంద్రబాబు శనివారం తెలిపారు. 17 కంపెనీలలోని సుమారు 1,205 ఉద్యోగ ఖాళీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, (డీబీఏమ్) ఫార్మసీ, MBBS, పీజీ, బీటెక్ విద్యార్హతలు గల 18-35 ఏళ్ల వయస్సు వారు ఈ మేళాకు హాజరు కావాలన్నారు.


