News March 12, 2025

మహిళలు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి: ఎస్పీ

image

ఏ సమస్య వచ్చినా వాటిని మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. మంగళవారం చెన్నే కొత్తపల్లిలో టింబక్టు కలెక్టివ్ వారి ఆధ్వర్యంలో జరిగిన మహిళా సదస్సులో ఎస్పీ మాట్లాడారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.

Similar News

News September 14, 2025

రేపు పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు: SP

image

జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గవర్నర్ పర్యటన భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరూ విషయాన్ని గమనించగలరని కోరారు. తదుపరి గ్రీవెన్స్ డే యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు.

News September 14, 2025

నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షెరాన్ బాధ్యతలు

image

నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షెరాన్ ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుత ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. నూతన ఎస్పీ మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తానన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 14, 2025

బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే ఏఐ

image

అధునాతన చికిత్సా విధానాలెన్నున్నా ఇప్పటికీ మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌‌తో మరణించేవారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి USలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు మిరాయ్ అనే ఏఐ సాధనాన్ని తయారుచేశారు. ఇది ఐదేళ్ల ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తిస్తుందని వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సాధనాలతో పోలిస్తే మిరాయ్ రెండు రెట్లు ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు.