News March 12, 2025
ప్రపంచమంతా ఏకమైనా టీమ్ ఇండియాను ఓడించలేరు: అఫ్రీది

ప్రస్తుతం టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉందని, ప్రపంచ క్రికెట్ మొత్తం ఒక జట్టుగా ఏర్పడినా ఆ టీమ్‌ను ఓడించలేరని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘భారత జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే. జట్టులోని ప్రతి ఒక్కరూ టాప్ ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియాను ఓడించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలే. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి వారు పూర్తి అర్హులే. భారత్‌కు నా శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 29, 2026
కుర్దిస్థాన్ అధ్యక్ష నివాసంపై డ్రోన్ దాడి

ఇరాక్‌లోని కుర్దిస్థాన్ రీజియన్ ప్రెసిడెంట్ నెచిర్వాన్ బార్జానీ నివాసంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. అమెరికా-ఇజ్రాయెల్ ఆ దాడి చేశాయని ఇరాన్ ఆరోపించగా, టెహ్రాన్ మద్దతున్న మిలిటెంట్లే హత్యాయత్నం చేశారని అమెరికా పేర్కొంది. కాగా కుర్దిస్థాన్ స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం. దీని రాజధాని ఎర్బిల్. ప్రత్యేక దేశ హోదా కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తోంది.
News March 29, 2026
పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే: కేటీఆర్

TG: పొంగులేటిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందేనని, ప్రభుత్వం దిగిరాకపోతే గవర్నర్‌ను కలుస్తామని KTR స్పష్టం చేశారు. అసెంబ్లీలో <<19499785>>రాఘవ<<>> కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై BRS ఆందోళనకు దిగింది. హౌస్ కమిటీ వేయాలని, పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పోడియం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో మార్షల్స్ అడ్డుకున్నారు. అనంతరం కేటీఆర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.
News March 29, 2026
BBC వార్తను ఖండించిన కేంద్రం

దేశంలో 5 రోజులకు మాత్రమే సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయంటూ BBC హిందీలో వచ్చిన వార్తను కేంద్రప్రభుత్వం (PIB ఫ్యాక్ట్‌చెక్) ఖండించింది. అది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేసింది. దేశంలో 60 రోజులకు సరిపడా స్టాక్ ఉందని తెలిపింది. మరో రెండు నెలలకు వరకు సప్లైకి ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని దేశ ప్రజలను కోరింది.


