News March 12, 2025
BPL:తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి సూసైడ్: SI

ఇంటర్ విద్యార్థి పురుగుమందు తాగి మరణించినట్లు తాళ్లగురజాల SIరమేశ్ తెలిపారు. SIకథనం ప్రకారం.. బెల్లంపల్లి మండలం పెరకపల్లికి చెందిన మనోజ్ కుమార్(18)అనే సీనియర్ ఇంటర్ విద్యార్థి పరీక్షలకు సిద్ధం కాకుండా ఫోన్‌లో ఆటలాడుతున్నాడని తల్లిదండ్రులు మందలించారు. దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మరణించాడని తండ్రి తెలుపాడని SI వివరించారు.
Similar News
News March 12, 2025
సత్యసాయి: డిప్లమా, డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు

శ్రీ సత్య సాయి జిల్లాలో డిప్లమా లేదా డిగ్రీలో మెగాట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ సిస్టం ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి హరికృష్ణ తెలిపారు. 18 నుంచి 40 సంవత్సరాలు వయసుగల యువతీ యువకులు వారికి ఏదైనా రంగంలో మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలన్నారు.
News March 12, 2025
త్వరలో ఆల్ పార్టీ మీటింగ్: భట్టి

TG: దేశంలో త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండగా, దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో పాల్గొనాలని అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖలు రాశారు. త్వరలోనే అఖిలపక్ష భేటీ తేదీ, వేదిక ప్రకటిస్తామని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
News March 12, 2025
NZB: 477 మంది గైర్హాజరు

జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ 2వ సంవత్సరం బోటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్-2ఏ పరీక్షకు మొత్తం 477 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 17,064 మంది విద్యార్థులకు 16,587 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. బోధన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇద్దరు విద్యార్థులు చీటీలు రాస్తుండగా పట్టుకుని మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశారన్నారు.