News March 12, 2025
సంగారెడ్డి: 20 మంది ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్: డీఈవో

జిల్లాలో 20 మంది ఉపాధ్యాయులను రెగ్యులరైజేషన్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ 16, లాంగ్వేజ్ పండిత్ ముగ్గురు, పీఈటీ ఒకరిని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెగ్యులరైజ్ పత్రాలు ఆయా టీచర్లకు అందజేస్తామని చెప్పారు. డీఈవో నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 12, 2025
దళితులకు ఆలయ ప్రవేశం కల్పించిన అధికారులు

పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో ఆలయ ప్రవేశం కోసం దళితులు చేస్తున్న పోరాటానికి ఫలితం లభించింది. గిధగ్రాంలో ఐదుగురు దళితులను పోలీసులు ప్రత్యేక భద్రతతో శివాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం వారితో ప్రత్యేక పూజలు జరిపించారు. గ్రామంలో దాదాపు 6 శాతమున్న తమకు కులవివక్ష పేరుతో ఇన్నేళ్లుగా ఆలయ ప్రవేశం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు లేఖ రాయడంతో తమకు న్యాయం జరిపించారని సంతోషం వ్యక్తం చేశారు.
News March 12, 2025
ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి జిల్లాలో డిగ్రీ పాసైన బీసీ అభ్యర్థులకు బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో ఉచిత ట్రైనింగ్, ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజలి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తారన్నారు. అర్హులు ఈనెల 15 నుంచి www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. SHARE IT
News March 12, 2025
మోహన్ బాబుకు మద్దతు తెలిపిన సౌందర్య భర్త

సినీనటుడు మోహన్ బాబుకు మద్దతు తెలుపుతూ దివంగత నటి సౌందర్య భర్త రఘు ఓ లేఖ రాశారు. ‘మోహన్ బాబుకు, సౌందర్యకు మధ్య ఎలాంటి గొడవలు, భూ లావాదేవీలు లేవు. నా భార్యకు సంబంధించిన ఏ ఆస్తిని ఆయన స్వాధీనం చేసుకోలేదు. సౌందర్య మరణించక ముందు, ఆ తర్వాత కూడా మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయంలో వస్తున్న <<15732112>>ఆరోపణలన్నీ<<>> అవాస్తవాలు. మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటాం. క్లారిటీ ఇవ్వడానికే నేను స్పందించా’ అని పేర్కొన్నారు.