News March 12, 2025

లిఫ్ట్ ఎక్కుతున్నారా? ఒక్క నిమిషం!

image

ఇళ్లు, ఆఫీస్‌లు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాల్స్‌లో నిత్యం లిఫ్ట్‌లు వాడుతుంటాం. కానీ ఎలివేటర్ల నిర్వహణ లోపం వల్ల ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్రమత్తతో వీటిని నివారించుకోవచ్చు. మీరు బటన్ నొక్కగానే లిఫ్ట్ మీ ఫ్లోర్‌కు వచ్చిందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఒక్కోసారి లిఫ్ట్ క్యాబిన్ రాకున్నా డోర్లు తెరుచుకుంటాయి. చూడకుండా అందులోకి ఎక్కాలని చూస్తే కిందపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

Similar News

News March 17, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభం

image

తెలంగాణలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెగ్యులర్ ధరలతో టికెట్లు అందుబాటులో ఉండటంతో ధరల పెంపు లేనట్లేనని తెలుస్తోంది. ఈ నెల 19న ఉ.7.30 గంటలకు మొదటి షో పడనుంది. కాగా ఏపీలో టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం <<19374694>>అనుమతినిచ్చిన<<>> సంగతి తెలిసిందే. అక్కడ ఉ.4 గంటలకు బెనిఫిట్ షో పడనుంది.

News March 17, 2026

SRH కెప్టెన్సీ రేసులో ఇద్దరు?

image

SRH జట్టులో కెప్టెన్ కమిన్స్ ఎప్పుడు చేరుతారో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మను కెప్టెన్ చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. తాజాగా ఇషాన్ కిషన్ పేరు కన్ఫర్మ్ అయిందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇషాన్‌‌కు 2016 U19 WCలో ఇండియాకు, డొమెస్టిక్ క్రికెట్‌లో ఝార్ఖండ్‌కు కెప్టెన్సీ చేసిన అనుభవముండగా, అభిషేక్‌ 2016 U19 ఆసియా కప్‌లో INDకు కెప్టెన్‌గా చేశారు. మరి వీరిలో SRH కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది?

News March 16, 2026

PHOTOS: శ్రీశైలం ఉత్సవాలు.. భృంగి వాహనంపై ఆది దంపతులు

image

AP: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు శ్రీస్వామి అమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపంలో ప్రత్యేక పూజలు అందుకున్న ఉత్సవమూర్తులకు వైభవంగా గ్రామోత్సవాన్ని జరిపించారు. గ్రామోత్సవం ముందు వివిధ కళారూపాల ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది. ఈనెల 20 వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.