News March 12, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం!

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తవ్వగా తెలంగాణ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ బరిలో ఉన్నారు. ఇక ఏపీ నుంచి బీటీ నాయుడు, గ్రీష్మ, బీదా రవిచంద్ర, సోము వీర్రాజు, నాగబాబు నామినేషన్లు వేశారు. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ ముగియనుండగా అదే రోజు సాయంత్రం ఈసీ ప్రకటన చేయనుంది.
Similar News
News March 12, 2025
సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

TG: 33 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్నివీర్‌ల నియామకం కోసం ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌మెన్, స్టోర్ కీపర్ పోస్టుల భర్తీ కోసం టెన్త్, ఇంటర్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 17.5 నుంచి 21 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు ఏప్రిల్ 10లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎత్తు, బరువు, ఛాతి, జీతం తదితర వివరాల కోసం పూర్తి <
News March 12, 2025
త్రిభాషా విధానం సరైనదే: సుధామూర్తి

విద్యార్థులు ఎక్కువ భాషలు నేర్చుకోవటం వల్ల అధిక ప్రయోజనం పొందుతారని ఎంపీ సుధామూర్తి అన్నారు. తనకు వ్యక్తిగతంగా 8 భాషలు వచ్చని నేర్చుకోవటమంటే ఎంతో ఇష్టమన్నారు. త్రిభాషా విధానం సరైనదే అని తెలిపారు. అయితే కాంగ్రెస్ ఎంపీ చిదంబరం హిందీని విద్యార్థులపై బలవంతంగా రుద్దకూడదని కేంద్రం విధానాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. NEPపై తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
News March 12, 2025
APPLY NOW.. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

AP: 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్నివీర్‌ల నియామకం కోసం ఇండియన్ ఆర్మీ <