News March 12, 2025

ఆదోని విషాద ఘటన.. మృతులు వీరే!

image

ఆదోని మండలం పాండవగల్లు గ్రామం వద్ద పెను విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. ముందువెళ్తున్న రెండు బైక్‌లను కర్ణాటక బస్సు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో కుప్పగల్లు గ్రామానికి చెందిన దంపతులు కురువ పూజారి ఈరన్న (25), పూజారి ఆదిలక్ష్మి (23), కర్ణాటకకు చెందిన భార్యాభర్తలు హేమాద్రి (40), నాగరత్న (35)తో పాటు వారి కుమారుడు దేవరాజు (20) ఉన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News November 12, 2025

వారితో మాకు సంబంధం లేదు: అల్ ఫలాహ్ యూనివర్సిటీ

image

ఢిల్లీ <<18265346>>ఎర్రకోట <<>>వద్ద పేలుడు కేసులో ప్రధాన నిందితులు అల్ ఫలాహ్ వర్సిటీ డాక్టర్లేనని అనుమానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వర్సిటీ VC భూపిందర్ కౌర్ తెలిపారు. డాక్టర్లు ముజామిల్, షాహీన్‌తో తమకు సంబంధం లేదన్నారు. ‘మేం ఎలాంటి రసాయనాలు నిల్వ చేయట్లేదు. ఉపయోగించట్లేదు. స్టూడెంట్ల అకడమిక్, ట్రైనింగ్ కోసం అవసరమైనంత వాడుతున్నాం’ అని పేర్కొన్నారు.

News November 12, 2025

HYD: రాష్ట్రంలో కాంగ్రెస్‌కి ఢోకా లేదు: TPPC

image

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, టీపీసీసీగా తామే ఉంటామని చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై స్టడీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మరో 10ఏళ్లు అధికారంలో ఉంటుందని, ఏ ఎలక్షన్ వచ్చినా గెలిచేది కాంగ్రెస్ అన్నారు.

News November 12, 2025

VZM: హోంగార్డ్స్ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు

image

2023-24 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 16మంది హెూంగార్డ్స్ పిల్లలకు రూ.2000 చొప్పున మెరిట్ స్కాలర్‌షిప్‌లు జిల్లా ఎస్పీ దామోదర్ తన కార్యాలయంలో నేడు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉన్నత విద్యతోనే భవిష్యత్తు బలపడుతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు. హెూంగార్డ్స్ సంక్షేమం కోసం ఇలాంటి ప్రోత్సాహకాలు కొనసాగుతాయని తెలిపారు.