News March 12, 2025
మెదక్: గ్రూప్-2లో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 3వ ర్యాంక్

టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ మనోహర్ రావు రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. మొత్తం 600 మార్కులకు 439.344 మార్కులు సాధించారు. గ్రూప్-1లో కూడా 430 మార్కులు సాధించారు. 2020లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి 317 జీవోలో మెదక్ జిల్లాకు వచ్చారు. స్వగ్రామం సంగారెడ్డి జిల్లా ఉజలంపాడు.
Similar News
News November 14, 2025
SAvsIND: ఈ‘డెన్’ మనదేనా?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో నేటి నుంచి టీమ్ఇండియా తొలి టెస్టు ఆడనుంది. ఈడెన్‌లో 42 మ్యాచులు ఆడిన భారత్ 13 గెలిచి, 9 ఓడగా మరో 20 మ్యాచులు డ్రాగా ముగిశాయి. చివరగా 2019లో BANతో జరిగిన టెస్టులో భారత్ గెలిచింది. అయితే ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ SAను తక్కువ అంచనా వేయొద్దని గిల్ సేన భావిస్తోంది. 9.30AMకు మ్యాచ్ మొదలుకానుంది. స్టార్ స్పోర్ట్స్, జియోహాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.
News November 14, 2025
బిహార్: ఓటింగ్ పెరిగితే ఫలితాలు తారుమారు!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగిన ప్రతిసారీ అధికార పార్టీ కుర్చీ దిగిపోయిందని గత ఫలితాలు చెబుతున్నాయి. 1967లో దాదాపు 7% ఓటింగ్ పెరగగా అధికారంలోని INC కుప్పకూలింది. 1980లోనూ 6.8%, 1990లోనూ 5.7%శాతం పెరగగా అధికార మార్పిడి జరిగింది. ఇక తాజా ఎన్నికల్లోనూ 9.6% ఓటింగ్ పెరిగింది. మళ్లీ అదే ట్రెండ్ కొనసాగుతుందా లేక ప్రజలు NDAకే కుర్చీ కట్టబెడతారా అనేది ఈ మధ్యాహ్ననికి క్లారిటీ రానుంది.
News November 14, 2025
అండర్-14 ఉమ్మడి గుంటూరు జిల్లా క్రికెట్ టీం కెప్టెన్‌గా బాపట్ల విద్యార్థి

ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీం కెప్టెన్‌గా బాపట్ల విద్యార్థి అబ్దుల్ సాద్ ఎంపికయ్యాడు. అతని ఎంపిక జిల్లాకు గర్వకారణమని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడు రఘునాథ్ తెలిపారు. శుక్రవారం నుంచి నిర్వహించనున్న సెంట్రల్ జోన్ మ్యాచ్ అండర్-14 జోన్ మ్యాచ్‌లో గుంటూరు జిల్లా టీం ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తేవాలని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాంమోహన్ రావు ఆకాంక్షించారు.


