News March 12, 2025
HYD: భగ్గుమంటున్న ఎండ.. రెండ్రోజులు జాగ్రత్త!

ఉమ్మడి RR. HYD వ్యాప్తంగా ఎండ భగ్గుమంటోంది. గత 24 గంటల్లో మూసాపేటలో గరిష్ఠంగా 36.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగోల్, బాలానగర్‌లో 36 డిగ్రీలు, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉక్కపోత ఉంటుందని TGDPS తెలిపింది. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో మార్చి 13, 14 తారీఖుల్లో 37- 39 డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంది.
Similar News
News January 8, 2026
హైదరాబాద్‌లో AQ 198కి చేరుకుంది

HYDలో ఎయిర్ క్వాలిటీ హెచ్చు తగ్గులుగా కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్‌క్వాలిటీ గురువారం తెల్లవారుజామున మణికొండ అల్కాపూర్ టౌన్‌షిప్ వద్ద 198కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతవారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఇవ్వాళ భారీగా తగ్గింది.
News January 8, 2026
HYD: CP సజ్జనార్ మాస్ వార్నింగ్!

నగరంలో కల్తీ మాఫియా ఆటకట్టించేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నడుం బిగించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే ‘హత్యాయత్నం’ కేసులు పెడతామని, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆహార భద్రతా అధికారులతో నిర్వహించిన భేటీలో తనిఖీల కోసం ప్రత్యేక SOPని ప్రకటించారు. కల్తీ సమాచారం ఇచ్చేందుకు త్వరలోనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ రానుంది. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని CP స్పష్టం చేశారు.
News January 8, 2026
HYDలో మిడ్‌నైట్ బిర్యానీకి పెరిగిన లవర్స్

నైట్ లైఫ్ అంటే క్లబ్బులు, పబ్బులే కాదు బాస్.. ఇప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి వీధుల్లో బిర్యానీ దెబ్బకు తెల్లవార్లూ తిరునాళ్లే. ‘జెన్ జీ’ గ్యాంగ్స్ 2 AM తర్వాత కూడా ఫుడ్ కోర్టుల్లో సందడి చేస్తున్నాయి. ఇన్‌స్టాలో ఫుడ్ రీల్స్‌కి మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో మార్కెట్ షేక్ అవుతోంది. కొందరైతే బిర్యానీ కోసం నైట్ ఔట్‌లే చేస్తున్నారు. ఈ డిమాండ్‌తో వేలాది మందికి ఉపాధి లభిస్తోంది.


