News March 12, 2025

సిరిసిల్ల: గ్రూప్-2 ఫలితాలు.. సత్తచాటిన యువకుడు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ చెందిన ఎగుమామిడి అఖిల్ రెడ్డి గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రంలో 34వ ర్యాంక్ సాధించాడు. అఖిల్ రెడ్డి చిన్ననాటి నుంచి చదువులో ముందు ఉండేవాడని గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News March 4, 2026

NLG: అంగన్వాడీలకు ఇక వెలుగులు

image

జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చర్యలు చేపట్టింది. చిన్నారుల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు కనెక్షన్ల ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నారు. జిల్లాలో సుమారు 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.

News March 4, 2026

తిరుపతి: రోడ్ల అభివృద్ధికి రూ. 24.24 కోట్లు

image

రోడ్ల అభివృద్ధిపై ఆర్ అండ్ బీ అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, రైల్వే కోడూరులోని నియోజకవర్గాల పరిధిలో మొత్తం 136.19 కిలో మీటర్ల మేర రోడ్లు మరమ్మత్తులు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రూ.24.24 కోట్లు నిధులు మంజూరైంది. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.

News March 4, 2026

ఇండియా కంటే ఇంగ్లండ్ స్పిన్ మెరుగ్గా ఉంది: మైఖేల్ వాన్

image

T20 WC: భారత్‌తో జరగనున్న సెమీఫైనల్లో ఇంగ్లండ్‌దే పైచేయి అని ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ జోస్యం చెప్పారు. ఇంగ్లండ్ వద్దే మెరుగైన స్పిన్ అటాక్ ఉందని అభిప్రాయపడ్డారు. ఆదిల్ రషీద్, లియామ్ డాసన్, విల్ జాక్స్ ఈ టోర్నీలో బెస్ట్ ఇచ్చారని కొనియాడారు. టీమ్‌ఇండియా X-ఫ్యాక్టర్ వరుణ్ చక్రవర్తిని ప్రత్యర్థి బ్యాటర్లు ఈజీగా ఎదుర్కొంటున్నారని, ఫీల్డింగ్‌లోనూ భారత్ వెనకబడి ఉందని విమర్శించారు.