News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. ఆసిఫాబాద్‌కు ఏం కావాలంటే..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న అంబేడ్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్న ఆడా, వట్టివాగు, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి నిధుల కేటయించాలని కోరుతున్నారు.

Similar News

News March 9, 2026

సిరిసిల్ల: 129 మంది విద్యార్థులు గైర్హాజరు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫిజిక్స్/ఎకనామిక్స్ పరీక్షలలో 129 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. 16 పరీక్ష కేంద్రాలలో మొత్తం 4437 విద్యార్థులకు గాను 4308 విద్యార్థులు హాజరు అయినట్లు వెల్లడించారు. పరీక్షలను జిల్లా అధికారులు పర్యవేక్షించారని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని వివరించారు.

News March 9, 2026

అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్

image

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన వికలాంగుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్జీలపై తక్షణమే విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం చేయాలని ఫోన్ ద్వారా అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన భరోసా కల్పించాలని సూచించారు.

News March 9, 2026

NZB: ఈ నెల 10న జాబ్ మేళా

image

ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 10న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీ.టెక్ పూర్తి చేసినవారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో నిజామాబాద్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. 18-35 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.