News March 12, 2025

రానున్న 24 గంటల్లో ఆ జిల్లాల్లో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. 19 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయంది. మరోవైపు, ఉపరితల ద్రోణి వల్ల నిన్న TNతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే. రాయలసీమలోని మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా మేఘాలు ఆవరించి కనిపించాయి.

Similar News

News January 1, 2026

ఒత్తువాములు కోరుతుంది, పలచన పాతర్లు కోరుతుంది

image

వాము (ఓమ) పంటను సాగు చేసేటప్పుడు మొక్కలు దగ్గర దగ్గరగా (ఒత్తుగా) ఉండాలి. అప్పుడే ఆ పంట దిగుబడి బాగుంటుంది. పాతర్లు (అంటే వరి నారు లేదా ఇతర కొన్ని రకాల పంటలు) నాటేటప్పుడు మొక్కల మధ్య తగినంత దూరం (పలచనగా) ఉండాలి. అప్పుడే ఆ మొక్కలకు గాలి, వెలుతురు సరిగా తగిలి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏ పంటకు ఎంత దూరం ఉండాలో తెలిపే వ్యవసాయ సూత్రాన్ని ఈ సామెత చెబుతుంది.

News January 1, 2026

కొత్త ఏడాదిలో.. సంపద కోసం!

image

లక్ష్మీదేవి నివాసంగా భావించే వికసించే చెట్టు ఆకును, అలాగే శుభప్రదమైన బియ్యం గింజలను పర్సులో ఉంచుకోవడం వల్ల ధన వృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ స్వరూపమైన గవ్వలు, తామర గింజలను ఎర్రటి గుడ్డలో కట్టి పర్సు/బీరువాలో భద్రపరుచుకోవడం వల్ల డబ్బు నిలకడగా ఉంటుందని నమ్మకం. గోసేవ చేస్తే దైవానుగ్రహం లభించి ఏడాది పొడవునా మీ ఇంట్లో దారిద్ర్యం తొలగి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ప్రగాఢ విశ్వాసం.

News January 1, 2026

ప్రభుత్వ పథకాలకు అప్లికేషన్లన్నీ ఆన్‌లైన్‌లోనే?

image

TG: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పేపర్ దరఖాస్తులకు బదులుగా అప్లికేషన్లను ఆన్‌లైన్‌లోనే స్వీకరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. పథకాల కోసం పేపర్లు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా పారదర్శకమైన ఆన్‌లైన్ విధానం తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. దీంతో మధ్యవర్తుల ప్రమేయం ఉండదని, నేరుగా లబ్ధిదారులకు స్కీమ్స్ అందుతాయని అనుకుంటున్నట్లు సమాచారం.