News March 12, 2025
గ్రూప్2 ఫలితాల్లో.. ADB వాసికి STATE 5TH ర్యాంక్

గ్రూప్2 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకులు సత్తా చాటారు. ఇందులో భాగంగా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన చింతలపల్లి వెంకట్ రెడ్డి కుమారుడు చింతలపల్లి ప్రీతంరెడ్డి గ్రూప్2 ఫలితాల్లో 431 మార్కులు సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు స్థానంలో నిలిచారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.
Similar News
News March 18, 2026
ADB: గ్రామాలను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా మార్చాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ‘మూడవ కన్ను’లా పనిచేస్తాయని, ప్రతి ఒక్కరూ వీటి ఏర్పాటుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
News March 18, 2026
ADB: ఖోడద్ అభివృద్ధికి ఉద్యోగుల కృషి భేష్- కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామ అభివృద్ధికి ఆ గ్రామానికి చెందిన ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. సొంత ప్రాంతంపై మమకారంతో విజ్ఞానాన్ని పంచేందుకు లైబ్రరీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు.