News March 12, 2025
గజ్వేల్: KCRని కలిసిన దాసోజు శ్రవణ్

ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చిన సందర్భంగా నామినేషన్ అనంతరం స్క్రూటినీ పూర్తిచేసుకున్న డాక్టర్ దాసోజు శ్రవణ్ మంగళవారం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసి, ఆశీర్వాదం తీసుకున్నారు.
Similar News
News October 31, 2025
ఐక్యత శిల్పి.. పటేల్ జ్ఞాపకాల్లో వరంగల్ చరిత్ర..!

భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కి వరంగల్ జిల్లాతో విశేష అనుబంధం ఉంది. 1948లో హైదరాబాద్ రాష్ట్ర విమోచన కోసం ఆయన ఆదేశాలపై ప్రారంభమైన ‘ఆపరేషన్ పొలో’ సమయంలో భారత సైన్యం వరంగల్ మార్గంగా ప్రవేశించి రజాకారులను తరిమికొట్టింది. పటేల్ దృఢనిశ్చయంతో వరంగల్ సహా తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో విలీనమవ్వడంతో ప్రజలు నిజమైన స్వేచ్ఛా వాయులను పీల్చుకున్నారు.
News October 31, 2025
VIRAL: అప్పుడు గంభీర్.. ఇప్పుడు జెమీమా

ఉమెన్స్ ODI వరల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్‌ను నెటిజన్లు గంభీర్‌తో పోలుస్తున్నారు. 2011 WC ఫైనల్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గంభీర్ 97 రన్స్ చేసి IND విజయంలో కీలక పాత్ర పోషించారు. నిన్నటి మ్యాచులో జెమీమా సైతం మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశారు. ఇద్దరి జెర్సీ నంబర్ ఒకటే కావడం(5), ఇద్దరి జెర్సీలకు మట్టి ఉండటంతో వారి ఫొటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
News October 31, 2025
గుంటూరు అబ్బాయి.. పోలాండ్ అమ్మాయి

గుంటూరులో గురువారం జరిగిన ఓ లవ్ మ్యారేజ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. పెదకాకాని యువకుడు పృధ్వీ కృష్ణ, పోలాండ్‌కు చెందిన పత్రీశియా పరస్పర ప్రేమతో ఒక్కటయ్యారు. కుటుంబ పెద్దల అంగీకారంతో, ఈ విదేశీ వధువుకు హిందూ సంప్రదాయంలో పెళ్లి చేశారు. సరిహద్దులు లేని ఈ ప్రేమ బంధం, రెండు సంస్కృతుల కలయికకు, యువతకు ఆదర్శంగా నిలిచిందని స్థానికులు కొనియాడారు.


