News March 12, 2025
గాజువాక: ఎలక్ట్రికల్ పోల్ పడి ఒకరు మృతి

గాజువాక సమీపంలో గల నాతయ్యపాలెం డైరీ వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఎలక్ట్రికల్ పోల్‌ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో కే.కోటపాడుకు చెందిన బొత్స కామేశ్వరరావు(37) తీవ్ర గాయాలవ్వగా స్థానికుల వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడ్డ మరో మహిళ దొడ్డి సత్యవతి చికిత్స పొందుతోంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 14, 2025
వికసిత్ భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యం: జేపీ నడ్డా

వికసిత భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో సారద్యమ్ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ అంధకారంలో మగ్గిందని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 15 నెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమయిందని చెప్పారు. మోదీ, చంద్రబాబు అంకితభావం వల్లే ఈ మార్పు సాధ్యమైందన్నారు.
News September 14, 2025
రేపు విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమీషనర్ కేతాన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. కలెక్టర్ కార్యాలయంలో, సీపీ, జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
News September 14, 2025
సృష్టి కేసులో విశాఖలో సిట్ తనిఖీలు

తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సృష్టి కేసులో విశాఖలోని 2 చోట్ల సిట్ అధికారులు, తెలంగాణ సిట్ బృందం
తనిఖీలు చేపట్టారు. నగరంలోని సృష్టి కార్యాలయం, ఆసుపత్రిలో రాత్రి 12:00 వరకు తనిఖీలు కొనసాగాయి. జిల్లా వైద్య అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించి తనిఖీలు చేపట్టగా విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కేజీహెచ్ డాక్టర్లు ముగ్గురు సస్పెండ్ కాగా మిగతావారి పాత్ర తేలాల్సి ఉంది.