News March 12, 2025

తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

image

తుంగతుర్తి PSలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎస్సై క్రాంతి కుమార్ వివరాలిలా.. రావులపల్లికి చెందిన నాగయ్య అడ్డగూడూరు మం. లక్ష్మీకాల్లపల్లికి చెందిన యువతితో పెళ్లైంది. గొడవల కారణంగా అతని భార్య పుట్టింటికి వెళ్లింది. నాగయ్య అత్తావారింటికి వెళ్లడంతో ఘర్షణ జరగ్గా, వారు PSలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో PSకు చేరుకున్న నాగయ్య పెట్రోల్ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అతణ్ని ఆస్పత్రికి తరలించారు. 

Similar News

News July 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (జులై 6, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 6, 2025

నేటి నుంచే రొట్టెల పండుగ.. షెడ్యూల్ ఇదే.!

image

➠ జులై 6వ తేదీ రాత్రి సందల్ మాలి
➠ 7వ తేదీ రాత్రి గంధం మహాత్సవం
➠ 8వ తేదీ రొట్టెల పండుగ
➠ 9వ తేదీ తహలీల్ ఫాతేహ
➠ 10వ తేదీ ముగింపు వేడుకలు
ఈ మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు నెల్లూరుకు తరలి వస్తున్నారు.

News July 6, 2025

చిత్తూరు: జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసుల పరిష్కారం

image

పలమనేరు కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 203 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు తదితర కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి లిఖిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్.భాస్కర్, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.