News March 12, 2025
అనకాపల్లి: ’15లోగా దరఖాస్తులు చేసుకోవాలి’

మహాత్మ జ్యోతి బాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు మరో మూడు రోజుల్లో గడువు మునియనుంది. ఈనెల 15 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి జిల్లా జ్యోతి బాపులే గురుకుల విద్యాలయాల కన్వీనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఇంటర్, 5,6,7,8,9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 23, 2026
కందుకూరులో వ్యభిచారం.. మహిళలు అరెస్ట్

ప్రకాశం జిల్లాలో వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరు పట్టణం ఉప్పుచెరువు ప్రాంతంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని ఎస్ఐ పులి శివ నాగరాజుకు సమాచారం అందింది. తన సిబ్బందితో ఆదివారం దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు.
News March 23, 2026
BREAKING.. మెదక్: యువకుడి హత్య

చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లి దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో గుర్తు తెలియని యువకుడు ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. మిర్జాపల్లికి చెందిన ప్రజలు ఈ దారిన వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. పరిశ్రమల సమీపంలో హత్య జరగడంతో హత్యకు గురైన వ్యక్తి ఎవరూ, హత్య చేసింది ఎవరూ అనే విషయాలు తెలియాల్సి ఉంది.
News March 23, 2026
ఎంజీఎంలో నిలిచిన 2డీ ఏకో సేవలు!

ఎంజీఎంలో 2డీ ఏకో యంత్రం పని చేయడం లేదు. దీంతో ఆస్పత్రికి రాత్రివేళ గుండె సంబంధిత సమస్యలతో వచ్చే బాధితులకు వైద్యం అందడం లేదు. సోమ, బుధ, శుక్రవారం KMC సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కార్డియాలజీ ఓపీలో 2డీ ఏకో పరీక్షలు చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఎంజీఎంలో చేసేవారు. ఇటీవల 2 డీ ఏకో యంత్రం పనిచేయక సేవలు నిలిచి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ సేవలందేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.


