News March 12, 2025
వచ్చే నెల అమరావతికి ప్రధాని మోదీ!

AP: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ప్రధాని కార్యాలయం అమరావతి పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజధాని పనులను అట్టహాసంగా మళ్లీ స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 9ఏళ్ల కిందట అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 19, 2026
ఏపీ విభజన వ్యాఖ్యల వివాదం.. తేజస్వీ సూర్య ఏమన్నారంటే?

తెలంగాణను ఉద్దేశించి లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంపై BJP MP తేజస్వీ సూర్య స్పందించారు. ‘కాంగ్రెస్ నిరక్షరాస్యుల పార్టీ. నేనేం మాట్లాడానో ఆ పార్టీ నేతలు మళ్లీ వినండి. ఆ సింపుల్ మాటలను వీలైతే అర్థం చేసుకోండి. INC లీడర్లు ఉద్దేశపూర్వకంగా, అజ్ఞానంతో నిరసన తెలుపుతున్నారు’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. ఉమ్మడి APని IND, PAK తరహాలో విభజించారని తేజస్వీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
News April 19, 2026
కాసేపట్లో వర్షం..

TG: సిరిసిల్ల, జగిత్యాల, సంగారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. అలాగే వికారాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సాయంత్రం వానలు పడతాయని చెప్పారు. ఇక హైదరాబాద్‌లో సాయంత్రం లేదా రాత్రి వర్షం పడొచ్చని పేర్కొన్నారు. అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.
News April 19, 2026
మాత్రేకు గాయం.. CSKకు మరో షాక్ తప్పదా?

CSKను గాయాలు వెంటాడుతున్నాయి. ఎల్లిస్, ధోనీ, <<19663724>>ఖలీల్<<>> తర్వాత ఈ జాబితాలో ఆయుష్ మాత్రే చేరినట్లు తెలుస్తోంది. SRHతో మ్యాచులో ఆయన కండరాల గాయంతో ఇబ్బంది పడటంపై బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ స్పందించారు. ‘ఇది కచ్చితంగా తొడ కండరాల్లో చీలిక రావడమే. త్వరలో స్కాన్ చేస్తాం. దురదృష్టవశాత్తూ పరిస్థితి తీవ్రంగానే కనిపిస్తోంది’ అని చెప్పారు. దీంతో మాత్రే కొన్ని మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాల అంచనా.


