News March 12, 2025
ఎడ్ల బండ్ల ప్రబలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

WGL(D) గీసుగొండ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర ప్రత్యేకమైనది. ఉమ్మడి జిల్లా నుంచి ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రబలతో ఇక్కడికి రావడం ఆనవాయితీ. జిల్లాలోని లంబాడా జాతులవారు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉదయం హోలీ జరుపుకున్న తర్వాత నుంచి జాతరకు పోటెత్తుతారు. కోలాటాలు, లంబాడా నత్యాలతో ఆలయం చుట్టూ ప్రబలు తిరుగుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. మరి జాతరకు మీరు వెళ్తున్నారా?
Similar News
News March 12, 2025
పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీలు పోటీపడాలి: కలెక్టర్

పార్వతీపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఈఓపిఆర్డీలకు స్వచ్ఛ సుందర పార్వతీపురం పై శిక్షణా కార్యక్రమం జరిగింది. బుధవారం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీలు పోటీపడి తమ పంచాయతీలను నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
News March 12, 2025
గార్ల: బైక్ యాక్సిడెంట్ మహిళకు తీవ్ర గాయాలు

గార్ల మండలంలోని పూమ్యా తండా శేరిపురం వెళ్లే రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు బుధవారం ఢీకొన్నాయి. ఒక ద్విచక్ర వాహనంపై మహిళా డ్రైవింగ్ చేస్తుండగా, మరొక వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.
News March 12, 2025
ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా కవిత

ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా టంగుటూరు మండలానికి చెందిన గడ్డం కవిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గ్రామీణ అభివృద్ధి సంస్థ జిల్లా డైరెక్టర్ నారాయణ తెలిపారు. ఒంగోలులోని టీటీడీసీ కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి ఏన్నికల్లో 38 మండలాలకు చెందిన మండల సమాఖ్య అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. ఎన్నికకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.