News March 12, 2025

ఎన్టీఆర్ జిల్లాకు ప్రత్యేక అధికారి

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు జి. జయ లక్ష్మి (IAS) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

Similar News

News March 6, 2026

మిల్లర్ల పిటిషన్ పై విచారణ 18కి వాయిదా

image

జిల్లాలో సంచలనం సృష్టించిన రూ.191 కోట్ల ధాన్యం మాయం కేసులో మిల్లర్ల క్వాష్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. జిల్లాలోని 7 మిల్లుల్లో సుమారు 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. తమపై నమోదైన కేసులు చెల్లవని, వాటిని కొట్టివేయాలని కోరుతూ ఐదు మిల్లుల నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

News March 6, 2026

నేపాల్ రిజల్ట్స్.. లీడింగ్‌లో RSP

image

హిమాలయ దేశం నేపాల్‌లో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP) 32 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. పార్టీ చీఫ్ రబి లామిచానే, సీనియర్ నేత బాలెన్ షా ముందంజలో కొనసాగుతున్నారు. RSP విజయం సాధిస్తే బాలెన్ షా(ఫొటోలో) PM అయ్యే అవకాశం ఉంది. పూర్తి రిజల్ట్స్ ఇవాళ సాయంత్రంలోపు రానున్నాయి.

News March 6, 2026

VKB: హాస్టల్ నుంచి వెళ్లి.. లవ్ మ్యారేజ్

image

పర్మిషన్ లేకుండా హాస్టల్ నుంచి ఓ విద్యార్థిని వెళ్లిపోయిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. SHO బాలస్వామి వివరాలిలా.. వికారాబాద్(D) ధారూర్‌కు చెందిన విద్యార్థిని(19) అంకుషాపూర్ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజీలో 2nd ఇయర్ చదువుతోంది. ఈ నెల 4న హాస్టల్ నుంచి వెళ్లింది. ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. VKBలో ప్రియుడితో వివాహం చేసుకున్నట్లు లోకల్ PS నుంచి ఘట్‌కేసర్‌ ఠాణాకు సమాచారమందింది.