News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. సంగారెడ్డి జిల్లా ఎదురుచూస్తోంది..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మంజీరా నదిలో నక్క వాగు నీళ్లు కాలుష్యం కాకుండా చూడాలి. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలి. ప్యారానగర్ డంప్ యార్డు రద్దు చేయాలి. సింగూరు జిల్లా మొత్తం నీళ్లు తాగుకు, సాగుకు అందించాలి. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలి.
Similar News
News March 18, 2026
మార్చి 18: చరిత్రలో ఈ రోజు

*1871: భారత సంతతికి చెందిన గణిత, తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్ మరణం
*1922: శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు మహాత్మా గాంధీకి 6 ఏళ్ల జైలు శిక్ష
*1938: బాలీవుడ్ నటుడు శశి కపూర్ జననం
*1965: అంతరిక్షంలో నడిచిన తొలి రోదసీ యాత్రికుడిగా అలెక్సీ లియనోవ్ రికార్డు
*1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ పదవీ విరమణ (ఫొటోలో)
News March 18, 2026
కాకతీయ యూనివర్సిటీ LL.M పరీక్షల షెడ్యూల్ విడుదల

కాకతీయ విశ్వవిద్యాలయం 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన LL.M I & III సెమిస్టర్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. హనుమకొండ, ఖమ్మం కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్సైటుని చూడాలని కోరారు.
News March 18, 2026
ఏలూరు: ఈనెల 18న ఉచిత బస్సు ప్రయాణం

జిల్లాలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ‘దివ్యంగా శక్తి’ పథకాన్ని ఈనెల 18న ప్రారంభించనున్నట్లు ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం తెలిపారు. భీమడోలు మండలం సత్యనారాయణపురంలో ఉదయం 11:30 నిమిషాలకు బస్సును ప్రారంభిస్తామన్నారు. బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణిస్తారన్నారు. దివ్యాంగుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.


