News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. సిద్దిపేట జిల్లాకు ఇవి కావాలి..?

image

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మరి సిద్దిపేటకు నిధులు కేటాయిస్తారా.. చూడాలి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టూరిజం స్పాట్ శిల్పారామం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ వద్ద బీచ్, ప్రభుత్వ వైద్య, నర్సింగ్, పశువుల వైద్య కాలేజీల్లో పెండింగ్‌‌ పనులతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రంగనాయక సాగర్ డ్యాం వద్ద ఎల్లమ్మ గుడి వద్ద బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి. యువతకు ఉపాధి కల్పించాలి.  

Similar News

News March 16, 2026

విజయవాడలో అర్ధరాత్రి యాక్సిడెంట్.. స్పాట్ డెడ్

image

విజయవాడలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నున్న డి మార్ట్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇరువురు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి పాయికాపురానికి చెందిన వాడిగా గుర్తించారు. మరో వ్యక్తి గాయపడగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News March 16, 2026

మార్చి 16: చరిత్రలో ఈరోజు

image

*1764: తెలుగు భాష తొలి నిఘంటు కర్త మామిడి వెంకటార్యులు జననం
*1901: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు జననం
*1917 ఆంధ్రప్రదేశ్ మెుదటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు జననం
*1963: భారత దేశ రెండో ప్రధాన న్యాయమూర్తి ఎం.పతంజలి శాస్త్రి మరణం
*జాతీయ టీకా దినోత్సవం

News March 16, 2026

మోపాల్: బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సినీ దర్శకుడు బలగం వేణు

image

మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి ఇందూరు తిరుమల క్షేత్ర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారికి చక్ర స్నానం, రథోత్సవం జరిపారు. సాయంత్రం పుష్ప యాగం నిర్వహించారు. ఈ వేడుకల్లో సినీ దర్శకుడు, నటుడు బలగం వేణు, సినీ నిర్మాత దిల్ రాజు, శిరీశ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవనాథ జీయర్ స్వామి ప్రవచించారు.