News March 12, 2025
జగిత్యాల: తాజా మాజీ సర్పంచుల ముందస్తు అరెస్ట్

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సర్పంచులకు రావలసిన పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో అసెంబ్లీ ముట్టడిస్తారని ఉద్దేశంతో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తమకు రావలసిన బకాయి బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు బిల్లులు చెల్లించే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని సర్పంచులు హెచ్చరించారు.
Similar News
News March 12, 2025
KNR: ఇంటర్ పరీక్షలకు 398 మంది గైర్హజరు!

కరీంనగర్ జిల్లా లో నిర్వహిస్తున్న ఇంటర్ ఎగ్జామ్‌లో భాగంగా సెకండ్ ఇయర్ పేపర్2 మ్యాథమెటిక్స్, బోటనీ ,పొలిటికల్ సైన్స్ ప్రశాంతంగా ముగిసినట్లు బుధవారం జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 16256 మంది విద్యార్థులకు 15858 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 398 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News March 12, 2025
VZM: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1,124 మంది చొప్పున రెండు విడతలకు 2248 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నట్లు చెప్పారు.
News March 12, 2025
ASF: స్త్రీనిధి రుణాలను 100 శాతం రికవరీ చేయాలి: అదనపు కలెక్టర్

మహిళా సంఘాల అభివృద్ధిలో భాగంగా అందించే స్త్రీ నిధి రుణాలను 100 శాతం రికవరీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో మెప్మా సిబ్బందితో స్త్రీ నిధి రుణాల రికవరీ, నూతన రుణాలు జారీ, ప్రమాద బీమా, బ్యాంకు లింకేజీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్చి నెలాఖరుకల్లా స్త్రీ నిధి రుణాల రికవరీ, ఓవర్ డ్యూస్ రికవరీ 100 శాతం పూర్తి చేసే విధంగా చూడాలన్నారు.