News March 12, 2025

పెద్దపల్లి జిల్లాలో భగ్గుమంటున్న భానుడు

image

వేసవి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బుధవారం ముత్తారం మండలంలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6℃గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 19.1℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.

Similar News

News March 10, 2026

వెంకటసుబ్బయ్య హత్య కేసు కొట్టివేత

image

నంద్యాల జిల్లా ఆర్యవైశ్య నాయకుడు తిరువీధి వెంకటసుబ్బయ్య హత్య కేసును ఆధారాలు లేని కారణంగా కోర్టు కొట్టివేసింది. 2021 సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటనలో అంబటి సాయిరెడ్డి, వెంకటేశ్వర్లను నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే న్యాయస్థానంలో నేరం నిరూపితం కాకపోవడంతో సెషన్స్ కోర్ట్ జడ్జి అమ్మన్నరాజు సోమవారం కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.

News March 10, 2026

పోలవరం: ఆవుపై పెద్దపులి దాడి

image

రాజవొమ్మంగి మండలంలోని జి.శరభవరం వద్ద ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపింది. గ్రామస్థుల వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున జి.శరభవరం గ్రామ సమీపంలో కోసురి వీధికి చెందిన గణపతి అనే మహిళకు చెందిన ఆవుపై పులి దాడి చేసింది. ఆవు మెడ భాగంలో తీవ్రంగా గాయమైంది. ఆ సమయంలో అలజడి ఉండడంతో పులి ఆవును వదిలి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.

News March 10, 2026

గ్యాస్ సరఫరా లేక హోటళ్లు బంద్!

image

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిషేధించలేదని కేంద్రం స్పష్టం చేసినా గ్రౌండ్ లెవెల్‌లో సప్లై జరగడం లేదని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ పేర్కొంది. ‘సిలిండర్ల సరఫరాలో గృహాలకు ప్రయారిటీ ఇవ్వాలని కేంద్రం చెప్పడంతో అయోమయం నెలకొంది. దీనిపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇవ్వాలి’ అని Xలో కోరింది. కాగా గ్యాస్ సరఫరా లేక ఇవాళ్టి నుంచి హోటళ్లు బంద్ చేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.