News March 12, 2025
గ్రూప్ 2లో మెరిసిన ఆసిఫాబాద్ ఆణిముత్యం

కౌటాల మండల వాసి సాయిరాం గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 191 ర్యాంకు సాధించారు. కాగా ఇప్పుడు బెజ్జూరు మండలం మొగవెల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, తోటి మిత్రులు అభినందనలు తెలిపారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాల్లో కూడా విజయం సాధించినప్పటికీ దానిని వదులుకున్నట్లు సాయిరాం గౌడ్ తెలిపారు.
Similar News
News January 14, 2026
కేశాలకు కర్పూరం

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కర్పూరం నూనెను వాడాలంటున్నారు నిపుణులు. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు రాసి తర్వాత రోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తెల్ల జుట్టును తగ్గించడంలోనూ కర్పూరం ఉపయోగపడుతుంది.
News January 14, 2026
అనాథ చిన్నారులతో భోగి సంబరాలు జరుపుకున్న కలెక్టర్ దంపతులు

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి దంపతులు భోగి పర్వదినాన్ని అనాథ చిన్నారులతో జరుపుకున్నారు. కె.ఎల్.పురంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ శిశువుల ఆశ్రమాన్ని తన సతీమణితో బుధవారం సందర్శించి శిశుగృహంలో చిన్నారులతో కలిసి భోగి పండుగను జరుపుకున్నారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు.
News January 14, 2026
అంకెల్లో మేడారం..!

శానిటేషన్ బ్లాకులు: 285
టాయిలెట్లు: 5,700
పారిశుద్ధ్య సిబ్బంది: 5,000
ట్యాంకర్లు: 150
ట్రాక్టర్లు: 100
స్వీపింగ్ మెషిన్లు: 18
JCBలు: 12
స్వచ్ఛ ఆటోలు: 40
డోజర్లు: 16
ట్రాన్స్ఫార్మర్లు: 196
విద్యుత్ స్తంభాలు: 911
విద్యుత్ లైన్లు: 65.75 కి.మీ
విద్యుత్ సిబ్బంది: 350
డీజిల్ జనరేటర్లు(బ్యాకప్): 28
వైద్య సిబ్బంది: 5,192
అంబులెన్సులు: 30
బైక్ అంబులెన్సులు : 40
గజ ఈతగాళ్లు: 210
సింగరేణి రUస్క్యు: 12


