News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. ఎదురు చూస్తున్న మానుకోట!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మెడికల్ కళాశాల నిర్మాణ భవనాలు, ప్రధాన రహదారులు, సైడ్ డ్రైనేజీలకు నిధులు కేటాయించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు, తాగునీరు అందించాలన్నారు. జిల్లాలో 100 పడకల ఆసుపత్రికి నిధులు మంజూరు చేసి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
Similar News
News March 28, 2026
జిల్లా యువత వీటికి దూరంగా ఉండండి: ఎస్పీ

ఐపీఎల్ సీజన్ నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా యువత ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్‌రావు సూచించారు. బెట్టింగ్ యాప్‌లు అప్పులపాలు చేసి ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కల్పిస్తాయని, వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తే 100కు ఫోన్ చేయాలని కోరారు. బెట్టింగులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 28, 2026
విజయవాడ: పోలీసులమంటూ దోపిడీ..!

విజయవాడ వన్‌టౌన్‌లో పోలీసులమని అని చెప్పి మెడికల్ షాపులో సామాగ్రిని ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. కృష్ణమోహన్ అనే వ్యక్తి గతంలో భాగస్వామ్యంతో నడిపిన మెడికల్ షాపును, వివాదాల కారణంగా ప్రస్తుతం ఒంటరిగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు దుండగులు షాపులోకి ప్రవేశించి, తాము పోలీసులమని నమ్మించి లోపల ఉన్న సామాగ్రిని తీసుకెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 28, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,510 పెరిగి రూ.1,48,090కు చేరింది. రెండు రోజుల్లోనే రూ.3,540 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,35,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,50,000గా ఉంది.


