News March 12, 2025

MBNR: LRS రాయితీ.. ఫోన్ చేయండి.!

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఎల్ఆర్ఎస్(LRS) దరఖాస్తు చేసుకున్న వారు ఈనెల 31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లిస్తే ప్రభుత్వం 25% రాయితీ కల్పించినట్లు కలెక్టర్ విజయేందిర ఓ ప్రకటనలో తెలిపారు. సందేహాలు ఉంటే కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 08542-241165, జిల్లా నగర పాలక సంస్థలో హెల్ప్ లైన్ నంబర్ 7093911352 (ఉ.10 గంటల-సా.6 గంటల వరకు)కు సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News March 12, 2025

MBNR: PHD ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి.!

image

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సులకు సంబంధించిన PHD ప్రవేశ ఫలితాలను మంగళవారం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ విడుదల చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 17 నుంచి 20 వరకు ఆయా కోర్సులలో ప్రవేశాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇది రాసిన ఉమ్మడి పాలమూరు వాసులు రిజల్ట్స్ http://www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లో చూడొచ్చన్నారు.

News March 12, 2025

గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

image

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.

News March 12, 2025

MBNR: తెలంగాణ బడ్జెట్.. పాలమూరుకి ఏమి కావాలంటే.?

image

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయాయి. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సాగునీటి సరఫరా, దీర్ఘకాల సమస్యలు, గ్రామాల్లో హెల్త్ సెంటర్లు, రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

error: Content is protected !!