News March 12, 2025
భువనగిరి జిల్లాలో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News July 9, 2025
మంగళగిరి: జనసేనలో చేరిన ఆర్య వైశ్య ప్రముఖులు

జనసేన పార్టీలోకి ఆర్యవైశ్య ప్రముఖులు చేరారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చార్టెడ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, వైశ్యసత్ర సముదాయం అధ్యక్షుడు దేవకీ వెంకటేశ్వర్లు, శ్రీకాశీ అన్నపూర్ణ చౌల్ట్రీస్ అధ్యక్షుడు భవనాసి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ వారికి సాదరంగా స్వాగతం పలికారు.
News July 9, 2025
రాజమండ్రి ప్రభుత్వ సంగీత పాఠశాల ప్రిన్సిపల్‌గా శ్రీనివాస శర్మ

రాజమండ్రిలోని విజయ శంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపల్‌గా పసుమర్తి శ్రీనివాస శర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన కుమారి మండపాక నాగలక్ష్మి విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలకు పదోన్నతిపై బదిలీ అయ్యారు. శ్రీనివాస శర్మ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
News July 9, 2025
మహిళా శిశు సంక్షేమ కార్యకలాపాలు పటిష్ఠంగా చేపట్టాలి: కలెక్టర్

మహిళా శిశు సంక్షేమ కార్యకలాపాలు పటిష్ఠంగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఫ్లోరెన్స్ ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. 1098 నంబర్‌పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో 200 మహిళలను వాట్సాప్ గ్రూప్ చేసి కార్యకలాపాలను చర్చించాలని, ర్యాలీలు చేపట్టాలన్నారు. బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలన్నారు.