News March 12, 2025

సంగారెడ్డి: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

image

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికీ ప్రమాదముంది. సంగారెడ్డిలో గాలినాణ్యత విలువ 108గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!

Similar News

News March 12, 2026

వికారాబాద్: గ్యాస్ సిలిండర్ల పేరుతో సైబర్ మోసాలు: ఎస్పీ

image

వంట గ్యాస్ సిలిండర్ల కొరతను సాకుగా చూపుతూ సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ప్రజలను అప్రమత్తం చేశారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని, తక్షణ డెలివరీ, అదనపు సిలిండర్లంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. అధికారిక యాప్‌ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని ఆమె సూచించారు.

News March 12, 2026

కర్నూలులో 261 మంది ఇంటర్ విద్యార్థుల గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 261 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 4,590 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 4329 మంది మాత్రమే పరీక్ష రాశారని వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

News March 12, 2026

కిడ్నీలను కాపాడుకుందామా!

image

నేడు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో ఉప్పు, చక్కెర తగ్గించాలి. బీపీ, షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. సొంత వైద్యంతో పెయిన్ కిల్లర్స్ వాడటం ప్రమాదకరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. SHARE IT