News March 12, 2025

చింతలమానేపల్లి: స్థానిక సంస్థల్లో కమలం వికసించాలి: ఎమ్మెల్యే

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. మంగళవారం చింతనమానేపల్లి మండలంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ మొదలు పార్లమెంట్ వరకు కమలం వికసించాలని కార్యకర్తలకు సూచించారు. పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 12, 2025

శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన బీసీ వెల్ఫేర్ సీనియర్ అసిస్టెంట్

image

శ్రీకాకుళం జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసుకు చెందిన Sr.అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కారు. ఇంక్రిమెంట్ల, ఎంట్రీ, బిల్లుల ప్రాసెస్ చేసే విషయంలో అదే శాఖకు చెందిన వివిధ B.C హాస్టల్‌లో పనిచేస్తే అటెండర్, కుక్‌ల నుంచి రూ.25,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

News March 12, 2025

ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు చర్యలు: బాపట్ల కలెక్టర్ 

image

ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి భారత ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులను, సీనియర్ నాయకులను ఆహ్వానిస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్థాయిలో ఏవైనా పరిష్కరించని సమస్యల ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 30 వ తేదీ నాటికి అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి భారత ఎన్నికల సంఘం సూచనలను ఆహ్వానిస్తుందన్నారు.

News March 12, 2025

పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీలు పోటీపడాలి: కలెక్టర్

image

పార్వతీపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఈఓపిఆర్డీలకు స్వచ్ఛ సుందర పార్వతీపురం పై శిక్షణా కార్యక్రమం జరిగింది. బుధవారం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీలు పోటీపడి తమ పంచాయతీలను నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

error: Content is protected !!