News March 12, 2025

గిద్దలూరు: రైలు ఎక్కి కరెంటు వైర్ పట్టుకున్న యువకుడు

image

గిద్దలూరులోని స్థానిక రైల్వే స్టేషన్‌లో బుధవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కాడు. అనంతరం పైన ఉన్న హై వోల్టేజ్ కరెంట్ వైర్‌ను పట్టుకున్నాడు. దీంతో షాక్ తగిలి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

Similar News

News January 20, 2026

ప్రకాశం: మద్యం ప్రీమియం స్టోర్‌కి దరఖాస్తులు

image

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విదేశీ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విక్రయానికి ప్రీమియం స్టోర్ లైసెన్స్ మంజూరు చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఆసక్తి కలిగిన వారు ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులను ఒంగోలు ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 20, 2026

ప్రకాశం SP మీకోసంకు 48 ఫిర్యాదులు

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు రాగా వారి సమస్యలను పోలీస్ అధికారులు అడిగి తెలుసుకున్నారు.