News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. జనగామ జిల్లా ఎదురుచూస్తోంది!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జనగామ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పాలకుర్తికి 100 పడకల ఆసుపత్రి, జిల్లాలో పెద్ద మొత్తంలో ఇండస్ట్రియల్ పర్క్స్, ఘనపూర్‌కు 100 పడకల ఆసుపత్రి, ముఖ్యంగా పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్, చెన్నూరు రిజర్వాయర్ పూర్తి చేసి దిగువ ప్రాంతాలను సాగు, తాగు నీరు అందించాలని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Similar News

News November 11, 2025

యాక్టివేటెడ్ చార్‌కోల్‌తో ఎన్నో లాభాలు

image

ప్రస్తుత కాలంలో ఫేస్ క్రీం, ఫేస్ వాష్ ఎందులో చూసినా యాక్టివేటెడ్ చార్‌కోల్ ఉంటోంది. దీంతో చాలా ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. * ఇది ఓపెన్ పోర్స్‌ను అన్‌క్లాగ్ చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడానికి ఇది బాగా పని చేస్తుంది. * మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో యాక్టివేటెడ్ చార్‌కోల్ కీలక పాత్ర పోషిస్తుంది. పొడిబారిన చర్మానికి తేమను అందిస్తుంది.

News November 11, 2025

HYD: దొరికిన రూ.1.5 లక్షలు తిరిగిచ్చాడు!

image

సాధారణంగా ఏదైనా వస్తువు దొరికితే, దానిని తీసుకెళ్లే నేటి రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ మహానుభావుడు గరీబ్‌రాత్ ఎక్స్‌ప్రెస్ రైలులో తనకు దొరికిన రూ.1.5 లక్షల నగదును పోలీసులకు అప్పగించాడు. తన మంచితనం, నిజాయితీని చూసి పోలీసులు తనను అభినందించారు. ఈ విషయం తెలిసిన పలువురు ‘ఎంతమంచి వాడవయ్యా’ అంటూ పోస్టులు చేస్తున్నారు.

News November 11, 2025

సమాజాభివృద్ధికి జ్ఞానం అవసరం: ఎస్పీ

image

సమాజాభివృద్ధికి జ్ఞానం ఎంతో అవసరమని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యామంత్రి, జ్ఞాన దీప్తి ప్రతీక అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. అనంరతం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన గొప్ప ఇస్లామిక్ పండితుడని కొనియాడారు.