News March 12, 2025
మంచిర్యాల: HMపై పోక్సో కేసు: CI

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోదరావు తెలిపారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించగా బాధితురాలి కుటుంబ సభ్యులు కలెక్టర్ కుమార్ దీపక్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓ ఉపాధ్యాయురాలిని వేధింపులకు గురి చేసినందుకు ఈనెల 5న రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో సైతం కేసు నమోదైంది.
Similar News
News March 12, 2025
రెవెన్యూ అంశాలపై పట్టు పెంచుకొవాలి: కలెక్టర్

మచిలీపట్నం కలెక్టరేట్‌లో మీకోసం సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్‌ఓ కే చంద్రశేఖరరావు, కె ఆర్ ఆర్ సి. ఎస్.డి.సి శ్రీదేవితో కలిసి రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పురోగతి, రీ సర్వే, గ్రామ, వార్డు సచివాలయాల సేవలు తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు.
News March 12, 2025
బీసీ స్టడీ సర్కిల్‌లో ఫ్రీ కోచింగ్.. అప్లై ఇలా

TG: BC స్టడీ సర్కిల్‌లో బ్యాంకింగ్&ఫైనాన్స్‌లో నెల రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డిగ్రీ పాసై 26yrsలోపు వయసున్న బీసీలు అర్హులు. మార్చి 15- ఏప్రిల్ 8 వరకు https://studycircle.cgg.gov.in/లో అప్లై చేయాలి. APR 12న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక ప్రైవేట్ బ్యాంక్‌లలో ఉద్యోగాలు కల్పిస్తారు. ఫోన్: 040-29303130.
News March 12, 2025
VZM: ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ అదనపు సహాయం

ప్రధానమంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ్, అర్బన్, పీఎం జన్‌మన్ పథకాల కింద గతంలో మంజూరై నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం అదనపు సహాయాన్ని ప్రకటించిందని కలెక్టర్ అంబేడ్కర్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిన మొత్తానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని అందిస్తుందన్నారు.