News March 12, 2025
అల్లూరి జిల్లాలో YSRకు చెప్పుల దండ

అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన YSR విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు, గాజులు, మద్యం సీసాలను కట్టారు. ఇది గమనించిన స్థానిక వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆ పార్టీ కోశాధికారి కుందెరి రామకృష్ణ విగ్రహానికి ఉన్న చెప్పులను, గాజులు తొలగించారు. YSRని అవమానించడం దారుణమని, ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
Similar News
News March 23, 2026
DANGER: ఈ పాస్‌వర్డ్స్ పెట్టుకుంటున్నారా?

హ్యాకర్లకు చిక్కకూడదంటే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో కేంద్రం పలు సూచనలు చేసింది. ‘12-16 అక్షరాల పాస్‌వర్డ్‌లో A-Z, a-z, 0-9, స్పెషల్ క్యారెక్టర్స్ (@, #, $, &) ఉండేలా చూసుకోండి. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఫోన్ నంబర్లు వాడకండి. 123456 లేదా password వంటివి అస్సలు వద్దు. ప్రతి అకౌంట్‌కు వేర్వేరు పాస్‌వర్డ్స్ వాడుతూ కాలానుగుణంగా వాటిని మారుస్తూ ఉండండి’ అని సూచించింది.
News March 23, 2026
అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలి: పెద్దపల్లి కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, కార్యాలయాలను శుభ్రంగా ఉంచి, ఫైళ్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలను వేచి ఉంచకుండా, దరఖాస్తులను మానవతా దృక్పథంతో త్వరగా పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు.
News March 23, 2026
ఖమ్మం: విధుల్లో నిర్లక్ష్యం.. ఇన్విజిలేటర్ రిలీవ్

జిల్లాలో పదో తరగతి ఆంగ్ల పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. 99.89 శాతం హాజరు నమోదైనట్లు డీఈఓ చైతన్య జైని తెలిపారు. బోనకల్ జెడ్పీహెచ్ఎస్ కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్‌ను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 16,918 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని వివరించారు.


