News March 12, 2025

సిరిసిల్ల: గ్రూప్-1లో సత్తా చాటిన హరిణి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన కన్నం హరిణి గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో 499.5 మార్కులు సాధించింది. హరిణి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగం వదిలేసి పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News November 5, 2025

HYD: పులులను లెక్కించాలని ఉందా.. మీ కోసమే!

image

దేశంలో పులుల సంఖ్య ఎంతో తెలుసుకోవాలనుందా? అవి ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది మీ కోసమే. వచ్చే ఏడాది జనవరిలో(17- 23 వరకు) ప్రభుత్వం పులుల గణన చేపట్టనుంది. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అయితే రోజుకు 10- 15 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అంతేకాక మీ వయసు 18- 60 ఏళ్లలోపు ఉండాలి. ఈ నెల 22లోపు అప్లై చేసుకోవాలి. వివరాలకు 040-23231440 నంబరుకు ఫోన్ చేయండి.

News November 5, 2025

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అస్వస్థత

image

అమలాపురం: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైసీపీ అమలాపురం ఇన్‌ఛార్జ్ పినిపే శ్రీకాంత్ ఆసుపత్రికి వచ్చారు. పలువురు వైసీపీ శ్రేణులు ఆసుపత్రి చేరుకుంటున్నాయి.

News November 5, 2025

సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు: రాజ్‌నాథ్ సింగ్

image

ఇండియన్ ఆర్మీని 10% అగ్రవర్ణాలు కంట్రోల్ చేస్తున్నారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘సైన్యానిది ఒక్కటే మతం. అదే “సైన్యధర్మం”. దానికి ఇంకో మతం లేదు’ అని అన్నారు. ఆర్మీని రాజకీయాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో సైన్యం ధైర్యసాహసాలతో దేశం తలెత్తుకొనేలా చేస్తోందన్నారు. కులమత రాజకీయాలు దేశానికి నష్టం చేస్తాయని పేర్కొన్నారు.