News March 12, 2025
సాయంకాలం వాకింగ్ చేస్తున్నారా?

వేసవికాలంలో సాయంకాలం వాకింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీంతో రాత్రి పూట నిద్ర బాగా పడుతుందని అంటున్నారు. ప్రతి రోజూ అరగంట నడిస్తే మెదడు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా రక్తపోటు సమస్య రాదు. సాయంకాలపు నడకతో శరీరంలోని కండరాలు బలపడటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి భోజనం తర్వాత కాసేపు నడవాలని సూచిస్తున్నారు.
Similar News
News March 12, 2025
చనిపోయిందనుకొని ఖననం చేస్తే.. చివరికి.!

మరణించిందని భావించి పూడ్చిపెట్టిన మహిళ తిరిగి లేచిన ఘటన USలో జరిగింది. 1915లో ఎస్సీ విలియమ్స్ మూర్ఛ వ్యాధితో చనిపోయిందనుకొని అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. అయితే, అంత్యక్రియలకు ఆలస్యంగా వచ్చిన తన సోదరి చివరి చూపు చూస్తానని శవపేటికను తెరవాలని కోరారు. దీంతో తవ్వి పేటిక తెరవగా ఆమె లేచి కూర్చొని నవ్వుతూ కనిపించారు. అది చూసిన వారంతా భయంతో పారిపోయారు. ఆ తర్వాత ఆమె మరో 47ఏళ్లు జీవించడం గమనార్హం.
News March 12, 2025
బీసీ స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్.. అప్లై ఇలా

TG: BC స్టడీ సర్కిల్లో బ్యాంకింగ్&ఫైనాన్స్‌లో నెల రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డిగ్రీ పాసై 26yrsలోపు వయసున్న బీసీలు అర్హులు. మార్చి 15- ఏప్రిల్ 8 వరకు https://studycircle.cgg.gov.in/లో అప్లై చేయాలి. APR 12న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక ప్రైవేట్ బ్యాంక్‌లలో ఉద్యోగాలు కల్పిస్తారు. ఫోన్: 040-29303130.
News March 12, 2025
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం: లోకేశ్

AP: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. పీజీ విద్యార్థులకు గత ప్రభుత్వం తొలగించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తిరిగి తీసుకొస్తామన్నారు. అలాగే ఫీజు బకాయిలు చెల్లించాలని కొన్ని కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న ఘటనలను ఒప్పుకునేది లేదన్నారు. ఏ కాలేజీ అయినా ఫీజులపై ఒత్తిడి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన సూచించారు.