News March 12, 2025
శాసనమండలిలో వైసీపీ నిరసన

AP: నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్లపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు మండలిలో నిరసనకు దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అంటూ విమర్శలు చేశారు. పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో మండలిని స్పీకర్ వాయిదా వేశారు.
Similar News
News March 7, 2026
వార్‌కు వారం!

ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి నేటికి వారం రోజులు పూర్తయింది. గత శనివారం (FEB 28) ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో US, రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. మొదటి రోజే సుప్రీంలీడర్ ఖమేనీ హతం కాగా ఇరాన్ ప్రతీకార దాడులతో యుద్ధం మిడిల్ ఈస్ట్‌లోని ఇతర దేశాలకు వ్యాపించింది. ఇరాన్‌లో ఇప్పటివరకు 1200 మందికిపైగా చనిపోగా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులతో 217 మంది ప్రాణాలు కోల్పోయారు.
News March 7, 2026
నేపాల్ రాజకీయాలను మలుపుతిప్పిన ‘స్టార్లు’

ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ జోరుతో నేపాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీని వెనుక ఇద్దరు ‘స్టార్లు’ ఉన్నారు. ఒకరు TV ప్రెజెంటర్, RSP ఫౌండర్ రబి లామిచానే కాగా మరొకరు ర్యాపర్ బాలెన్ షా. 2022లో RSP స్థాపించిన రబి, రాజకీయ చతురతతో తక్కువకాలంలో Dy.PM హోదాకు చేరారు. ఇక ర్యాపర్ బాలెన్ షా యువతలో ఆదరణ సంపాదించారు. 2025లో షా RSPలో చేరి రబితో చేతులు కలపడంతో అక్కడి పాలిటిక్స్ మలుపు తిరిగాయి.
News March 7, 2026
US-ఇరాన్ పోరు.. డిస్కౌంట్‌లో బంగారం!

US, ఇజ్రాయెల్-ఇరాన్ పోరు ప్రభావం బంగారంపైన పడింది. దుబాయ్‌లో వ్యాపారులు తమ స్టాక్స్ క్లియర్ చేసేందుకు ఔన్స్ బంగారానికి (31 గ్రాములు) దాదాపు 30 డాలర్ల డిస్కౌంట్‌కు అమ్మేసుకుంటున్నారు. విమానాల రద్దుతో ఎగుమతులకు అంతరాయం, హై షిప్పింగ్ ఛార్జెస్ వల్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇక భారత్‌లో సమృద్ధిగా బంగారం నిల్వలు ఉన్నందున సరఫరాకు అంతరాయం కలిగినా ఇబ్బంది లేదు.


