News March 12, 2025
నెల్లూరు: ANMల కౌన్సెలింగ్ వాయిదా

నెల్లూరు జిల్లాలో సచివాలయం ఏఎన్ఎంలు (గ్రేడ్-3)గా పనిచేస్తున్న 289 మందికి ఎంపీహెచ్ఏ(ఎఫ్)గా ఇటీవల ఉద్యోగోన్నతి కల్పించారు. వీరికి సబ్ సెంటర్ల కేటాయింపునకు సంబంధించి మార్చి 13న నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. 17న నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర తెలిపారు. సీనియారిటీ సమస్యలు ఉత్పన్నం కాకుండా జోన్ పరిధిలోని జిల్లాల్లో ఒకే రోజు నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News January 29, 2026
నెల్లూరు జిల్లాలో సబ్సిడీ ఇస్తున్నా..!

జిల్లాలో పశువులు 57,774, బర్రెలు 6,46,106, గొర్రెలు 10,95,197, మేకలు 3,86,929 చొప్పున ఉన్న పశు సంపదకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన ఎనిమల్ షెల్టర్స్ పడకేశాయి. జిల్లాకు 2700 షెల్టర్స్ మంజూరైతే 800 మాత్రమే పూర్తవ్వగా మిగిలిన 1900 నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉంది. పశువులకు రూ.2.30 లక్షలకు 90% సబ్సిడీ, గొర్రెలు, మేకలకు రూ.2.30 లక్షలు, పౌల్ట్రీ కింద రూ.1.32 లక్షలకు 70% సబ్సిడీ ఇస్తున్నారు.
News January 29, 2026
నెల్లూరు: 4 గవర్నమెంట్ ఉద్యోగాలు..!

ఓ ప్రభుత్వ ఉద్యోగం రావడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఓ యువకుడు 4 ఉద్యోగాలు సాధించాడు. అనంతసాగరం(M) కొత్తపల్లికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ కుమారుడు లాల్ అహమ్మద్ బీటెక్ చదివాడు. 2019లో పంచాయతీ కార్యదర్శిగా, తర్వాత జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ సాధించారు. ప్రస్తుతం మనుబోలు MRO ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తుండగా.. గ్రూప్-2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు.
News January 29, 2026
నెల్లూరు జిల్లాలో డబ్బులు ఇవ్వందే పని చేయరు..!

నెల్లూరు జిల్లాలో కరెంటోళ్లు మామూళోల్లు కాదు. గ్రామాల్లో వారు చెప్పిందే వేదం. ఎప్పుడొస్తే అప్పుడే పని. అప్పటి వరకు ప్రమాదమైనా అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిందే. పని చేస్తే వాళ్లు అడిగినంత ఇవ్వాల్సిందే. లేకుంటే తిరిగి ముఖం కూడా చూడరు. జిల్లాలో 247 మంది లైన్‌మెన్లకు 50మందే ఉండటంతో వీరికి డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయడం లేదు. మీ ఏరియాలో లైన్‌మెన్ పనితీరుపై కామెంట్ చేయండి.


