News March 12, 2025

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్

image

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇవాళ్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చారు. దీంతో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇది రెండోసారి.

Similar News

News April 16, 2026

యుద్ధానికి సిద్ధపడుతున్న ఇరాన్?

image

US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ఓవైపు పాక్ సన్నాహాలు చేస్తున్న వేళ ఇరాన్‌లో పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. ఏప్రిల్ 21 నుంచి స్కూళ్లకు వర్చువల్ లెర్నింగ్‌ అమలు చేయనుంది. స్కూళ్లపైనా గతంలో <<19620831>>దాడులు<<>> జరిగిన నేపథ్యంలో మళ్లీ యుద్ధం మొదలైతే పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మిస్సైల్ కేంద్రాల మరమ్మతులను ఇరాన్ ముమ్మరం చేసింది.

News April 16, 2026

రాష్ట్రమంతటిపై ‘అమరావతి’ భారం: సజ్జల

image

AP: అమరావతి పేరుతో చంద్రబాబు రూ.వేలకోట్లు దోచుకుంటున్నారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘CBN చేస్తున్నది సంపద సృష్టికాదు దోపిడీ. ఇతర చోట్ల ఇటువంటి నిర్మాణాలకు Sftకి ₹3వేలలోపు ఉంటే ఇక్కడ ₹14వేలు ఖర్చు చేస్తున్నారు. హైరైజ్డ్ పేరిట 40-50 అంతస్తులు కడుతూ మొబిలైజేషన్ అడ్వాన్సులిస్తున్నారు. ఇదంతా మోయలేని భారం. ఆ ఖర్చును రాష్ట్రమంతా భరించాలంటున్నారు’ అని పార్టీ BC నేతల భేటీలో విమర్శించారు.

News April 16, 2026

రామాయణ ఫైనల్ ఔట్‌పుట్ అదిరిపోతుంది: యశ్

image

‘రామాయణ’ VFXపై విమర్శలు వస్తున్న వేళ యశ్ కామెంట్స్‌ ఫ్యాన్స్‌లో అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి పనిచేస్తున్నది ప్రతిష్ఠాత్మక DNEG కంపెనీ అని, ఫైనల్ ఔట్‌పుట్ అదిరిపోతుందని అన్నారు. గ్రాఫిక్స్ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయన్నారు. కాగా DNEG డ్యూన్-2, టెనెట్, ఇంటర్‌స్టెల్లార్ వంటి బ్లాక్‌బస్టర్లకు గ్రాఫిక్స్ అందించింది. ఈ నేపథ్యంలో సినిమా ఔట్‌పుట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.