News March 12, 2025

WNP: తెలంగాణ బడ్జెట్.. మన జిల్లాకు ఏమి కావాలంటే.?

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని పలు వాగులపై చెక్ డ్యాం నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని అంటున్నారు. అదే విధంగా జిల్లాలో ఉన్న తిరుమలయ్య గుట్ట, శ్రీరంగాపురంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Similar News

News April 17, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

మెళియాపుట్టి: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు
వ్యవసాయం రైతులకు జీవనాడి: జడ్పీ సీఈఓ
శ్రీకాకుళం: జిల్లా కేంద్రానికి చేరుకున్న నరసన్నపేట పంచాయతీ రగడ
జనగణన ప్రక్రియను ప్రారంభించిన మంత్రి అచ్చెన్న
పాలీసెట్ ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్
పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే బగ్గు

News April 17, 2026

నాణ్యమైన ఉత్పత్తులనే అందించాలి: ఐటీడీఏ పీవో

image

భద్రగిరి మార్ట్‌లో నాణ్యత ధ్రువీకరించిన వ్యవసాయ, నిత్యావసర సరుకులనే విక్రయించాలని ఐటీడీఏ పీవో రాహుల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆర్గానిక్ ఉత్పత్తులను గ్రేడింగ్ చేశాకే సేకరించాలని, ప్యాకెట్లపై తయారీ, గడువు తేదీలు ఉండాలని స్పష్టం చేశారు. ఎస్‌హెచ్‌జీ మహిళల సరుకుల తయారీని అధికారులు నెలకు ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతను నిర్ధారించాలని సూచించారు.

News April 17, 2026

VKB: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించండి: కలెక్టర్

image

ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్నందున నీటిని పొదుపుగా వాడటంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎండల దృష్ట్యా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు.