News March 12, 2025
అనకాపల్లి: ఇంటర్ పరీక్షలకు 325 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 325 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. జనరల్, ఒకేషనల్ గ్రూపులకు సంబంధించి మొత్తం 12,481 విద్యార్థులకు గాను 12,156 మంది హాజరు అయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు.
Similar News
News November 5, 2025
IIM షిల్లాంగ్‌లో ఉద్యోగాలు

<
News November 5, 2025
లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా

20 అంశాల కార్యక్రమ అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆయన బుధవారం జిల్లాలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, సాయంత్రం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అనివార్య కారణాలవల్ల ఈ పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News November 5, 2025
వనపర్తి: జిల్లా వ్యాప్తంగా 1,61,314 రేషన్ సంచులు పంపిణీ

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 327 రేషన్ దుకాణాలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 1,61,314 సంచులను సరఫరా చేసింది. ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి కాటన్ సంచులను సరఫరా చేయడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆన్‌లైన్‌లో వేలిముద్ర వేసి బియ్యాన్ని తీసుకున్న వారికి మాత్రమే సంచులను సరఫరా చేయనున్నట్లు అధికారులు, రేషన్ డీలర్లు తెలియజేశారు.


