News March 12, 2025
BREAKING: KCRను కలిసిన పటాన్‌చెరు MLA

తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం ఈరోజు జరిగింది. అసెంబ్లీకి వచ్చిన BRS అధినేత KCRను పటాన్‌చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికార్డును KCRకు ఇచ్చి ఆహ్వానించారు. కొన్ని నెలల క్రితం ఆయన BRSను వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానూ మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన KCRను కలవడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.
Similar News
News March 7, 2026
నెలకు ₹2,500.. ఫ్రీ బస్ జర్నీ: మహిళలకు TVK చీఫ్ వరాలు

తమిళనాడు ఎన్నికల దృష్ట్యా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు TVK చీఫ్ విజయ్ కీలక హామీలు ప్రకటించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. లేడీస్ కోసం ప్రత్యేకంగా పోలీస్ విభాగం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పేదలకు ఏటా ఫ్రీగా 6 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. పాఠశాల చిన్నారులకు ఏడాదికి ₹15 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మహిళలకు నెలకు ₹2,500 ఇస్తామని హామీ ఇచ్చారు.
News March 7, 2026
NRPT: కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలు

ఈవీఎంలు భద్రపరిచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని అడిషనల్ కలెక్టర్ ఫణిందర్ రెడ్డి తెలిపారు. శనివారం నారాయణపేటలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాములోని ఈవీఎంలను త్రైమాసిక తనిఖీలో భాగంగా అదనపు కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
News March 7, 2026
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి: ADB ఎస్పీ

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఏఐ మార్ఫింగ్, యూపీఐ, లోన్, ఉద్యోగాల పేరుతో సాగే మోసాల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ఈ వారంలో జిల్లాలో 8 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని వెల్లడించారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, బాధితులు వెంటనే స్పందిస్తేనే నగదు రికవరీకి అవకాశం ఉంటుందన్నారు.


