News March 12, 2025
మెదక్: హోలీ పండుగ సంతోషంగా జరుపుకోవాలి: ఎస్పీ

హోలీ పండుగను కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సంస్కృతి అద్దం పట్టేలా జరుపుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి జరిమానాలకు, రోడ్డు ప్రమాదాలకు గురై జైలు పాలు కావద్దని సూచించారు. హోలీ పండగ వేళ మన తోటి ఆడపడుచులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని తెలిపారు.
Similar News
News March 19, 2026
61 మందితో మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు

మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీని గురువారం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ప్రకటించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా జిల్లా కమిటీని విస్తరించారు. జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులను మొత్తం 61 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీని విస్తరించినట్లు తెలిపారు.
News March 19, 2026
మెదక్: విషాదం.. వ్యక్తి సూసైడ్

నిజాంపేట మండల కేంద్రంలో అప్పుల బాధ తాళలేక పంజా సత్తయ్య(46) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మించడంతో అప్పులు పెరిగి, తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 19, 2026
ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


