News March 12, 2025

రాయచోటిలో వైసీపీ జెండా ఆవిష్కరణ

image

రాయచోటిలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, చింతల రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం వైసీపీని స్థాపించినట్లు చెప్పారు.

Similar News

News April 6, 2026

ఇరాన్, USకు సీజ్‌ఫైర్ ప్లాన్.. ఏం జరగబోతోంది?

image

యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్, USకు సీజ్‌ఫైర్ ప్లాన్ అందినట్లు Reuters తెలిపింది. వెంటనే కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని, హార్ముజ్‌ను ఓపెన్ చేయాలని ప్రపోజల్స్ పెట్టినట్లు చెప్పింది. ఈ డ్రాఫ్ట్ ప్లాన్‌ను పాక్ రూపొందించినట్లు పేర్కొంది. అన్ని అంశాలపై ఈ రోజే అంగీకారం కుదరాలని సూచించినట్లు వెల్లడించింది. US ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఇరాన్ మంత్రి అరాఘ్చీతో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చర్చించినట్లు తెలిపింది.

News April 6, 2026

సంగారెడ్డి: వివాహేతర సంబంధం.. కత్తితో పొడిచి చంపిన భర్త

image

సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. స్థానికుల వివరాలిలా.. జహీరాబాద్‌కు చెందిన కవిత(29) గత నెలలో మరొకరితో వెళ్లిపోయింది. జడ్చర్లలో ఆమెను గుర్తించిన పోలీసులు తీసుకొస్తుండగా సదాశివపేట మండలం నందికంది వద్ద మార్గమధ్యంలో భర్త సిద్ధారెడ్డి కత్తితో కవితపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 6, 2026

VKB: ‘అధికారులు కీలక భూమిక పోషించాలి’

image

ప్రజావాణికి వచ్చే వినతులను పరిష్కరించడంలో అధికారులు కీలక భూమిక పోషించాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి నమ్మకంతో వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒకసారి దరఖాస్తు చేసుకున్న సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.